బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా..సెకండ్ షెడ్యూల్ ను ఏప్రిల్ నుండి మొదలుపెట్టనున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఏప్రిల్ నుండి మరో షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. ఇక మరో హీరోయిన్ గా శ్రియ ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘గౌతమ పుత్ర శాతకర్ణి’, పైసా వసూల్ సినిమాల్లో నటించారు.
కాగా శ్రియ – అంజలి కథానాయికలుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మరి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం బాలయ్య, బోయపాటిలు ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో ఒకేసారి ఇద్దరూ హిట్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: