వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం జైసేన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రయిలర్ ను విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ – “సముద్ర స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ‘జైసేన’ ది పవర్ ఆఫ్ యూత్ మూవీ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఎపుడైనా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సాలిడ్ స్క్రిప్ట్ తో వస్తారు సముద్ర. ఈ సినిమాకి కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ తో ఒక మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు. శ్రీకాంత్, సునీల్ తో పాటు చాలా మంది యంగ్ స్టర్స్ ఈ సినిమాలో నటించారు. నిర్మాణ విలువలు కూడా ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమాలా ఉన్నాయి. దర్శకుడు సముద్రతో పాటు ఈ టీమ్ అందరికి ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “మా సినిమా ట్రైలర్ విడుదలచేసిన విక్టరీ వెంకటేశ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు వెంకటేష్ గారు రిలీజ్ చేసిన ట్రైలర్ కి అంతకన్నా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. అందరి హీరోల అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన’. అన్నారు
నటుడు శ్రీ కార్తికేయ మాట్లాడుతూ – “వెంకటేశ్ గారి చేతుల మీదుగా మా ట్రైలర్ విడుదలవ్వడం హ్యాపీ గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
నటుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ – “అతి త్వరలో మీ అందరిని థియేటర్స్ లో కలవబోతున్నాము. మా చిత్రానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
నటుడు అభిరామ్ మాట్లాడుతూ – “వెంకటేశ్ గారు మా ట్రైలర్ విడుదలచేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.“ అన్నారు.
కాగా ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ తదితరులు నటిస్తున్నారు. వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: