గతకొద్ది రోజులుగా నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. వైజయంతి మూవీస్ చెప్పినట్లే భారీ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చేసింది. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Proud to associate with #Prabhas for our prestigious project directed by @nagashwin7.https://t.co/WYEptLI3MF#PrabhasNagAshwin
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020




కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియన్ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























