ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన అరణ్యం నేపథ్యంలో రూపొందిన “అరణ్య” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. హిందీ లో “హాథీ మేరే సాథీ “, తమిళంలో “కాడన్” టైటిల్స్ తో రిలీజ్ కానుంది. శ్రియ పిల్ గోవింకర్ , విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
గురువారం (13వ తేదీ ) “అరణ్య” మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఆ సందర్భంగా హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ .. అస్సాం రాష్ట్రం లోని నిజ సంఘటనలతో “అరణ్య” మూవీ తెరకెక్కిందని, పర్యావరణం లో మనం ఒక భాగం అని తెలియపరిచే మూవీ ఇదని, ఈ మూవీ లో నటించడంతో జీవితం అంటే తెలుసుకున్నానని, వ్యక్తిగా, నటుడిగా చాలా విషయాలు నేర్చుకున్నానని రానా చెప్పారు. దర్శకుడు ప్రభు సోలమన్ మాట్లాడుతూ .. మూడు భాషలలో 30 ఏనుగులతో సినిమా రూపొందించడం అంత ఈజీ కాదని, “అరణ్య” మూవీ కోసం ట్రావెల్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: