హీరో ‘సైలెంట్’ అయినా సినిమా ‘హిట్టే’

ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి.. ప్రేక్షకులను మెప్పించి హిట్లు కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలు.. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ – గోపాల గోపాల మూవీ

‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి ఎంట్రీ అంత తొందరగా మరచిపోలేము. గత సినిమాల్లో చేసినట్టు హీరోయిన్ ను టీజ్ చేయడం… డ్యాన్స్ లు వేయడం ఫైటింగ్స్ ఇవన్నీ ఈ సినిమాలో కుదరదు. కృష్ణుడి పాత్ర కాబట్టి ఎలాంటి హడావుడి లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సిన పాత్ర ఇది. ఇక పవన్ కూడా అందుకు తగ్గట్టుగానే చాలా సెటిల్డ్ గా తన బాడీ లాంగ్వాజ్, హావభావాలతోనే చక్కగా నటించి మెప్పించాడు.

మహేష్ బాబు – శ్రీమంతుడు

కొరటాల శివ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా పేరు వింటే గ్రామదత్తత అనే కాన్సెప్ట్ గుర్తుకు వస్తుంది. సందేశాత్మక చిత్రాలు కమర్షియల్ విజయం సాధించవు అంటారు. కానీ శ్రీమంతుడు మాత్రం దీనికి మినహాయింపు. మహేష్ బాబును అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా ఇందులో చూపించాడు శివ. ఇక మహేష్ కూడా ఈ సినిమాలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సెటిల్డ్ గా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం డాకించుకున్నాడు. ఓ వైపు మెసేజ్ ఇస్తూనే మరోవైపు మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా కొరటాల తెరకెక్కించాడు ఈ సినిమాను. ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లో కూడా మహేష్ చాలా సైలెంట్ గానే నటించి సూపర్ హిట్స్ అందుకున్నాడు.

ప్రభాస్ – ఛత్రపతి

ప్రస్తుతం అంటే బాహుబలి తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది కానీ.. అంతకుముందు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో అలరించేవాడు. ఇక బాహుబలి సినిమా ముందు ప్రభాస్ అంత సైలెంట్ గా సెటిల్డ్ గా నటించిన సినిమా అంటే ఛత్రపతి అని చెప్పొచ్చు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ – శ్రియా జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2005 లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సెంటిమెంట్,యాక్షన్,రొమాన్స్,లవ్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ సమపాళ్ళలో కలిసిన చిత్రం ఛత్రపతి . ఇక ఈ సినిమాతో దాంతో ప్రభాస్ రేంజ్ కూడా అనూహ్యంగా పెరిగింది.

[custom_ad]

ఎన్టీఆర్ – అరవింద సమేత

కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. టెంపర్ సినిమాలో చూసిన ఎన్టీఆర్ కు.. ఈ సినిమాలో చూసిన ఎన్టీఆర్ కు చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అంత సైలెంట్ గా మెచ్యూర్డ్ గా నటిస్తాడు. అంతే కాదు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా నటుడిగానూ ఎన్టీఆర్‌ను సరికొత్తగా ఆవిష్కరిచింది. ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో మాట్లాడిన తారక్‌ సూపర్బ్ అనిపించాడు. ఇక ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ సైలెంట్ గా కేవలం డైలాగ్స్ తోనే సినిమాను నడిపిస్తాడు. క్లైమాక్స్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా అంతే సైలెంట్ గా ఉంటుంది ఈ సినిమాకు.

అల్లు అర్జున్ – s/oసత్యమూర్తి

ఎప్పుడూ యాక్టీవ్ గా వుండే అల్లు అర్జున్ ను కదలకుండా ఒకే చోట ఉంచి చూపించడం కష్టమే. కానీ త్రివిక్రమ్ మాత్రం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అల్లు అర్జున్ ను ఇలా కూడా చేయగలడు అని చూపించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటిసారి అంత సైలెంట్ గా సెటిల్డ్ గా నటించాడు. అల్లు అర్జున్ కే ఇది ఛాలెంజింగ్ రోల్ అని అనిపించిందంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఏదిఏమైనా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటనలో మరో యాంగిల్ కూడా ఉందని తెలిసింది.

రామ్ చరణ్ – ధృవ

వరస పరాజయాలతో హిట్ కోసం ఎదురుచూసిన రామ్ చరణ్ కు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ సినిమాతో హిట్ కొట్టాడు. గత సినిమాలతో పోల్చి చూసుకుంటే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో రామ్ చరణ్ చాలా సెటిల్డ్ గా నటించి అలరించాడు. పెద్ద పెద్ద డైలాగ్స్ లేకుండా కేవలం విలన్ కు హీరో కు మధ్య బ్రెయిన్ గేమ్ ను చాలా ఆసక్తికరంగా చూపించాడు సురేందర్ రెడ్డి. ఇక ఈ పాత్రలో రామ్ చరణ్ కూడా చాలా సెటిల్డ్ గా గత సినిమాల కంటే భిన్నంగా నటించాడు.

నాని – జెర్సీ

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జెర్సీ’. ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో ‘వన్ ఆఫ్ ది బెస్ట్’ మూవీగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఏ వుంది. ఇక ఈ సినిమాలో ఫెయిల్డ్ క్రికెటర్‌గా.. అసమర్ధపు తండ్రిగా, భర్తగా నాని చేసిన నటన అద్భుతం. ఎలాంటి మాస్ డైలాగ్స్, పంచ్‌‌ డైలాగ్స్ లేకుండా కూడా ఒక సినిమాను కేవలం నటన.. సున్నితమైన పదాలతో నడిపించవచ్చని చెప్పారు.

[custom_ad]

నాగ చైతన్య – మజిలీ

నిజానికి నాగ చైతన్య లవర్ బాయ్ లాగా.. కాస్త డీసెంట్ గా వుండే రోల్స్ మాత్రమే సూట్ అవుతాయి. మరీ పెద్ద డైలాగ్స్, యాక్షన్ సీన్స్.. మరీ మాస్ సినిమాలు చైతు కి పెద్దగా నప్పవు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు చై. మరి నాగ చైతన్య విషయానికొస్తే ఇటీవల అంత సైలెంట్ గా.. సెటిల్డ్ గా నటించిన సినిమా మజిలీ అని చెప్పొచ్చు. సమంత నాగ చైతన్య కలిసి నటించిన మజిలీ అందరినీ అన్ని రకాలుగా ఆకట్టుకుంది. ఎమోషనల్ టచ్ ఉన్న కథ కాబట్టి చై ఆ సన్నివేశాల్లో మాత్రం జీవించేసాడు. గతంలో ఏం మాయ చేశావే, ప్రేమమ్ సినిమాలో కూడా చై తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు.

నితిన్ – అ.ఆ..

త్రివిక్రమ్‌ – నితిన్‌ల కలయికలో వచ్చిన ‘అ ఆ’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా నితిన్ పాత ధోరణికి స్వస్తి చెప్పి తన నటనలో మరో కోణం చూపించాడు. భాద్యత కల ఓ కొడుకు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. పెద్ద పెద్ద యాక్షన్ డైలాగ్స్, ఫైట్స్ లేకుండా తను కూడా చాలా సైలెంట్ గా నటించగలని ఈ సినిమాతో చూపించాడు నితిన్.

విజయ్ దేవరకొండ – గీత గోవిందం

తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’,ట్యాక్సీవాలా’ సినిమాలతో ఒక్క సారిగా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక విజయ్ దేవకొండ సినిమాలు చూస్తే అర్జున్ రెడ్డి సినిమాకు, గీత గోవిందం సినిమాకు అసలు సంబంధమే ఉండదు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ ఫుల్ అగ్రెసివ్ గా లవర్ బాయ్ లా కనిపించగా..గీత గోవిందం సినిమాలో మాత్రం చాలా సైలెంట్ గా.. ఫ్యామిలీ కి ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలో సెటిల్డ్ గా నటించి హిట్ కొట్టాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =