ఆ మధ్య `మనం`లో తండ్రి నాగార్జున పేరుని స్క్రీన్ నేమ్ చేసుకుని విజయం అందుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ఇటీవల `మహానటి`లో ఏకంగా తాతయ్య అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఒదిగిపోయి మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కట్ చేస్తే.. మరోసారి తాత `నాగేశ్వర రావు` పేరుని స్క్రీన్ నేమ్ చేసుకుని చైతూ మరో సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు.. టైటిల్ కూడా `నాగేశ్వర రావు`గానే ఉంటుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో చైతూ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి `నాగేశ్వర రావు` అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారని టాక్. త్వరలోనే టైటిల్ పై మరింత క్లారిటీ వస్తుంది. మరి.. `మనం`, `మహానటి`లా చైతూకి ఈ మూవీ కూడా మెమరబుల్ గా నిలుస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: