సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్”, క్రేజీ హీరో ధనుష్ “లోకల్ బాయ్” మూవీస్ తో పాటు కొత్త నటీనటులతో రూపొందిన “శివ 143”, “లైఫ్ అనుభవించురాజా”, “ఒక చిన్న విరామం” మూవీస్ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందిన “హుషారు”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”, “మత్తు వదలరా” వంటి మూవీస్ ఘనవిజయం సాధించడంతో పలు మూవీస్ కొత్త కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1.వరల్డ్ ఫేమస్ లవర్ :
సీనియర్ ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు సమర్పణ లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడు గా రూపొందిన రొమాంటిక్ డ్రామా “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీ వాలెంటైన్ డే సందర్భంగా 14 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్ కథానాయికలు. గోపిసుందర్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్,ట్రైలర్ ఈ మూవీ పై అంచనాలను పెంచాయి .
2.లోకల్ బాయ్ :
సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన తమిళ మూవీ “పట్టాస్” సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. ధనుష్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో స్నేహ, మెహరీన్ కథానాయికలు. వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. “పట్టాస్” మూవీ తెలుగు
డబ్బింగ్ వెర్షన్ “లోకల్ బాయ్”గా 14వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు లో ధనుష్ మూవీస్ కు క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
3.శివ143 :
భీమవరం టాకీస్ బ్యానర్ పై సాగర్ శైలేష్ దర్శకత్వంలో సాగర్ శైలేష్, ఆయేషా, హృతికా సింగ్ ప్రధాన పాత్రలలో ది జర్నీ ఆఫ్ టు హార్ట్స్ టాగ్ లైన్ తో “.శివ143” మూవీ రూపొందింది. మనోజ్ కుమార్ చేవూరి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల విశేష స్పందన లభించింది.
4.ఒక చిన్న విరామం :
మూన్ వాక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సందీప్ చేగురి దర్శకత్వంలో సంజయ్ వర్మ, గరిమా సింగ్ జంటగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన థ్రిల్లర్ మూవీ “ఒక చిన్న విరామం” 14 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఒక కీలక పాత్రలో నటించారు. భరత్ మాచిరాజు సంగీతం అందించారు.
5.లైఫ్ అనుభవించు రాజా :
ఎఫ్ &ఆర్ సమర్పణలో రాజా రెడ్డి మూవీ మేకర్స్ బ్యానర్ పై సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో జూనియర్ రవితేజ, శృతి శెట్టి, శ్రావణి నిక్కీ ప్రధాన పాత్రలలో విలక్షణ కథ , కథనాలతో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “లైఫ్ అనుభవించు రాజా ” మూవీ 14 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ సంగీతం అందించారు.
[custom_ad]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: