ఒకవైపు `భీష్మ`, `రంగ్ దే` వంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూనే.. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు యువ కథానాయకుడు నితిన్. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఇందులో నితిన్ చదరంగపు క్రీడాకారుడిగా కనిపిస్తాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు… `చదరంగం`, `ఏ 1` వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని కథనాలు వచ్చాయి. అయితే, యూనిట్ మాత్రం `చెక్` అనే టైటిల్ వైపే మొగ్గు చూపిస్తోందట. త్వరలోనే ఈ టైటిల్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
[custom_ad]
నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ ఫిల్మ్ లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: