డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ మూవీ “RRR” సంక్రాంతి కానుకగా 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “RRR” మూవీ లో అజయ్ దేవగన్ అతిథి పాత్రలో నటించినందుకు తనకు రెమ్యునరేషన్ వద్దుఅని చెప్పినట్టు సమాచారం. అజయ్ దేవగన్ మాట్లాడుతూ .. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “ఈగ” (2012 ) హిందీ డబ్బింగ్ వెర్షన్ కు చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటినుండీ రాజమౌళి తో తన స్నేహం కొనసాగుతుందని, “RRR” మూవీ కొరకు ఆయనతో పనిచేయడం తనకు దక్కిన గౌరవం అని, ఒక స్నేహితుడి కోసం స్నేహపూర్వకంగా అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నానని అజయ్ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: