`సీటీమార్`కి భూమిక `స్పోర్ట్స్` సెంటిమెంట్

Seetimaar Movie Team,Bhoomika Sports Scentiment in Seetimaar,Seetimaar Movie Latest Updates,Actress Bhoomika,Bhoomika New Movies 2020,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

`గౌత‌మ్ నంద‌` త‌రువాత యాక్ష‌న్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్ లో `సీటీమార్` పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో గోపీచంద్ క‌బ‌డ్డీ కోచ్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ కి అక్క పాత్ర‌లో భూమిక క‌నిపించ‌నుంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌విలో జ‌నం ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. భూమిక ఇప్ప‌టివ‌ర‌కు న‌టించిన స్పోర్ట్స్ డ్రామాల‌న్నీ కూడా మంచి విజ‌యం సాధించడంతో `సీటీమార్`పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `బ‌ద్రి` (`త‌మ్ముడు`కి త‌మిళ రీమేక్), క‌బ‌డ్డీ బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కిన తెలుగు చిత్రం `ఒక్క‌డు`లో భూమిక నాయిక‌గా న‌టించ‌గా ఆ రెండు సినిమాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఇక క్రికెట్ నేప‌థ్యంలో రూపొందిన హిందీ చిత్రం `ఎమ్మెస్ ధోని`లో ధోనికి అక్క‌గా న‌టించింది భూమిక‌. స‌ద‌రు చిత్రం కూడా మంచి సక్సెస్ అయింది. ఈ నేప‌థ్యంలో.. భూమిక `స్పోర్ట్స్` సెంటిమెంట్.. `సీటీ మార్`కి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + two =