మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ వయసులో కూడా రజినీ చేసిన కామెడీ, స్టైల్, మ్యానరిజమ్స్ కు మరోసారి అభిమానులను ఫిదా అయ్యారు. ఇలా రజినీ ని చూసి చాలాకాలం అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గట్లేదు. ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ. 20 కోట్లకు పైగా షేర్ ను సాధించింది. తొలిరోజున కలెక్షన్లు మామూలుగా అనిపించినా, ఆపై థియేటర్లు తగ్గినా, సినిమా బాగుండేసరికి కలెక్షన్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ లైకా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘ఆట ఎవరైనా ఆడతారు.. కానీ సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుంది’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Here’s the Worldwide Box-office collections of #DARBAR
“Anyone can play the game, but the throne always belongs to the EMPEROR 👑”@rajinikanth @ARMurugadoss #Nayanthara @anirudhofficial @santoshsivan @sreekar_prasad #Santhanam @SunielVShetty #DarbarPongal #DarbarBlockbuster pic.twitter.com/f2z0MGlzVv
— Lyca Productions (@LycaProductions) January 13, 2020
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: