‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం

All Set For Disco Raja Pre Release Event

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న ఈసినిమా నుండి మరో టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇకపోతే చిత్ర బృందం ప్రీరిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న హైదరాబాద్ నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =