అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన పలు చిత్రాలు తెలుగు యవనికపై చెరగని ముద్రను వేశాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ ఒకటి. తమ్ముళ్ళు ఏం చేసినా వారిని వెనకేసుకుని రావడమే కాకుండా… “నా తమ్ముళ్ళు జమ్స్” అంటూ చిరు చేసిన సందడికి అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘చూడాలని వుంది!’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చిరు, సౌందర్య జంటగా నటించిన ఈ సినిమాలో రవితేజ, వెంకట్, చాందిని, శిష్వా, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, భుపేందర్ సింగ్, ఉత్తేజ్, ప్రియ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించగా… సిమ్రాన్ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. చిరు కమ్ బ్యాక్ ఫిల్మ్ `హిట్లర్`(1997)ని రూపొందించిన ముత్యాల సుబ్బయ్య.. ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. `హిట్లర్` సిస్టర్స్ సెంటిమెంట్ తో రూపొందితే… `అన్నయ్య` బ్రదర్స్ సెంటిమెంట్ తో తెరకెక్కడం విశేషం. అంతేకాదు… ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ కావడం మరో విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల, వెన్నెలకంటి, భువనచంద్ర గీత రచన చేయగా… “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ జనాదరణ పొందాయి. “గుసగుసలే”, “ఆట కావాలా”, “హిమ సీమల్లో”, “వాన వల్లప్ప”, “బావా చందమామలు”, “సయ్యారే సయ్య”… ఇలా అన్ని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ పతాకంపై డా. కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2000 జనవరి 7న విడుదలై ఘనవిజయం సాధించిన ‘అన్నయ్య’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: