మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి, దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `నమ్మిన బంటు` ఒకటి. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రంలో యస్వీ రంగారావు, గుమ్మడి, రేలంగి, గిరిజ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాలూరి రాజేశ్వరరావు, మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా.. కొసరాజు గీతరచన చేయగా మాస్టర్ వేణు స్వరకల్పనలో ఘంటసాల, పి.సుశీల గానం చేసిన `ఎంత మంచివాడవురా` పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. కట్ చేస్తే.. 60 ఏళ్ళ తరువాత ఇప్పుడా వాక్యాలనే శీర్షికగా చేసుకుని కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం సంక్రాంతికే రిలీజ్ కానుండడం విశేషం. 1960 జనవరి 7న విడుదలైన `నమ్మిన బంటు` నేటితో 60 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: