ఫ్యాన్స్ కు పండగ లాంటి గుడ్ న్యూస్ ప్రకటించింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్. పాటలు, టీజర్, పోస్టర్ లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊపిరాడనివ్వకుండా చేశారు. ఇక ఫైనల్ గా మిగిలింది ట్రయిలర్. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు.
ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: