సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ఎట్రాక్షన్

Sarileru Neekevvaru Mega Super Event Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Mega Super Event Highlights,Sarileru Neekevvaru Movie Mega Super Event Highlights,Sarileru Neekevvaru Telugu Movie Mega Super Event Highlights

ఈ రోజున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ఘనమైన వేడుక జరుగుతుంటే చీఫ్ గెస్ట్ గా రావటానికి ఒక స్థాయి, స్టేచర్ ఉన్న సీనియర్ పర్సనాలిటీ దొరకటం కష్టం అయిపోయింది. ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండగా ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఆయన రాకను కోరుకునేవారు. ఆయన కూడా సాధ్యమైనంత వరకూ అన్ని వేడుకలకు హాజరవుతూ శుభాకాంక్షలు, శుభాభినందనలు అందజేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీనియర్ స్టార్స్ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వయోభారంతో అన్ని వేడుకలకు హాజరు కాలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మీద ప్రెజర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా అత్యంత భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం “సరిలేరు నీకెవ్వరు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సరైన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే అందరి దృష్టి
మెగాస్టార్ చిరంజీవి మీదనే కేంద్రీకృతమైంది. అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి రావటానికి చిరంజీవి అంగీకరించటం పరిశ్రమలో ఒక సుహృద్భావ  వాతావరణానికి సంకేతంగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక సీనియర్ స్టార్ గా తన గ్రేసియస్ ప్రెజెన్స్ తో ఇలాంటి వేడుకలను విజయవంతం చేసే బాధ్యతను చిరంజీవి స్వీకరించటం అభినందనీయం. అలాగే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలన్న సూపర్ స్టార్ మహేష్ బాబు , నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకరల ఆలోచనలో గొప్ప
ఔచిత్యం ఉంది. ముఖ్యంగా మన అగ్ర తారల మధ్య చక్కని స్నేహపూరిత వాతావరణం, ఉందని చెప్పటానికి ఒక తాజా ఉదాహరణగా నిలుస్తుంది ఈనాటి సరిలేరు నీకెవ్వరు వేడుక.

ఆ మధ్య ” సైరా నరసింహారెడ్డి” రిలీజ్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు చెప్పటం ఇరువురి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఇండస్ట్రీలో  అగ్ర తారల మధ్య ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండటం, వారు ఇలాంటి సందర్భాలలో పరస్పరం సహకరించు కోవడం ఆహ్లాదకరమైన వాతావరణానికి దారి తీస్తుంది.
మొత్తానికి “సరిలేరు నీకెవ్వరు”
ప్రీ రిలీజ్ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనటంలో సందేహం లేదు.
ఈ మధ్యకాలంలో చిరంజీవి చిత్ర పరిశ్రమలో ఒక చక్కని సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పటానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఆయన స్థాయి వ్యక్తి శ్రమ తీసుకుని పరిశ్రమలో జరిగే వేడుకలకు హాజరవటంమే కాకుండా
విజయవంతమైన చిత్రాల యూనిట్ మెంబర్స్ ను ప్రోత్సహిస్తూ అభినందనలు, ఆశీస్సులు అందజేయటంతో కీర్తిశేషులు దాసరి నారాయణరావు తరువాత ఇండస్ట్రీ పెద్దగా ఆ బాధ్యతను స్వీకరిస్తున్నందుకు చిరంజీవిపై అభినందనల వర్షం కురుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − thirteen =