కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రూలర్’. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రయిలర్ లతో అంచనాలు పెంచిన ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా..?లేదా? అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, సప్తగిరి, సాయాజీ షిండే తదితరులు
దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
నిర్మాత : సి కళ్యాణ్
సంగీతం : చిరంతన్ భట్
సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్
కథ:
అర్జున్ ప్రసాద్ (బాలయ్య) పెద్ద ఐటీ బిజినెస్ మాగ్నెట్. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళ్లిన అర్జున్ ప్రసాద్ సోనాల్ చౌహన్ ప్రేమలో పడతాడు. సోనాల్ మొదట ద్వేషించినా ఫైనల్ గా అర్జున్ ప్రసాద్ ప్రేమలో పడుతుంది.ఇక వారి పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఒక ప్రాజెక్ట్ విషయమై ఉత్తర ప్రదేశ్ వెళతాడు. అక్కడ రాజకీయంగా పాతకుపోయినా ఒక పొలిటికల్ లీడర్ దీనికి అడ్డు పడతుంటాడు. ఇదిలా ఉండగా అక్కడ అతణ్ణి అందరూ ధర్మ అని పిలవడం మొదలుపెడతారు. అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అర్జున్ కు ఏమైనా గతముందా? వంటి విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఈ కథ విషయానికి వస్తే ఎలాంటి నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. బాషా, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఈ సినిమాల్లో ఫస్ట్ హాఫ్ లో సింపుల్ గా వుండే ఒక మనిషి.. ఇంటర్వెల్ వచ్చేసరికి.. పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉండటం.. ఇలా ఈ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు చాలానే చూసాం. ఇక ఈ కథ కూడా అలాంటిదే. బాలయ్యతో ‘జై సింహా’ వంటి మంచి హిట్ అందించిన కే.యస్.రవికుమార్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
ఇక బాలకృష్ణ ఈ సినిమాకు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మరోసారి తనదైన ఎనర్జీతో అభిమానులను అలరించాడు. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. పంచ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలలో బాలకృష్ణ తన మార్కుతో అదరగొట్టారనే చెప్పాలి. తనకలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సీఈవోగా బాలయ్య లుక్ అదిరిపోయింది. ఇక హీరోయిన్స్ విషయాని వచ్చేసరికి సోనాలి చౌహాన్ కేవలం గ్లామర్ కి మాత్రమే సరిపోయింది. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించిన వేదిక ఆకట్టుకుంటుంది. అటు గ్లామరస్ గా ఉంటూనే, ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో మెప్పించింది.
ఇక నాగినీడు, ప్రకాష్ రాజ్, జయసుధ తమకలావాటైన పాత్రలే కాబట్టి ఆకట్టుకుంటారు. భూమిక కూడా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. సప్తగిరి, సాయాజీ షిండే, ధనరాజ్, శ్రీనివాస రెడ్డి వంటి వారు కామెడీ చేయడానికి బాగా కష్టపడ్డారు.
సాంకేతిక వర్గానికి వస్తే విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.చిరంతన్ భట్ అందించిన సంగీతం ఫర్వాలేదని అనిపిస్తుంది. పరుచూరి మురళి అందించిన కథ, కథనాలు ఏమాత్రం కొత్తగా అనిపించవు. కెమెరావర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
డైరెక్టర్ రవికుమార్ రొటిన్ కథతో బండి లాగించేసాడు. కమర్షియల్ సినిమా అనగానే పాట, ఫైటు అన్న తరహాలో ఉండాలని భావించి అదే వే లో సినిమాను తీసుకెళ్లారు.కేవలం బాలకృష్ణ ఇమేజ్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కమర్షియల్ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. దీనితో మొదటి భాగం పర్వాలేదు అనిపిస్తే రెండవ భాగం మొత్తానికే తేలిపోయింది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా బాలయ్య అభిమానులకు తప్పా మిగిలిన వాళ్లకు నచ్చడం కొంచెం కష్టమైన పనే..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: