మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. సాయి తేజ్ నటన, రావు రమేశ్ పర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ సినిమాకు కలిసి వచ్చాయి. ఎమోషన్ సీన్లు బలవంతంగా ఉన్నాయి. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుండి పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అలాగే మారుతి యూవీ, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గతంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ తరువాత ప్రతిరోజు పండగే సినిమా వారి కాంబినేషన్ లో మరో హిట్ సినిమాగా నిలిచిందనడంలో సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: