వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాట, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఢిల్లీ వాలా’ అనే పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరి గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న రవితేజ ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలని చూస్తున్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా రవితేజాకు మంచి సక్సెస్ వస్తుందేమో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: