బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీమామ’. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను థమన్ చూసినట్టు తెలిపారు డైరెక్టర్ బాబి. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను థమన్ చూశాడని.. ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసాడు.. సినిమా చూసిన తర్వాత థమన్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ నా కాన్ఫిడెన్స్ ను ఇంకా పెంచిందని తెలిపాడు. అంతేకాదు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.. థ్యాంక్స్ బ్రదర్ అని ట్వీట్ చేశారు.
And it’s @MusicThaman who watched the complete movie first as an audience. His words about the movie output doubled our confidence. It’s all your instruments and hard work behind the Mass and feel good emotional BGM which took the movie to the next level. Tq u brother 🤗🤗 pic.twitter.com/eIXc5ZQf86
— bobby (@dirbobby) December 4, 2019
ఇక ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య.. రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. చూద్దాం మరి వీరిద్దరూ కలిసి సందడి చేస్తారో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: