“తలైవి ” మూవీ లో శశికళ పాత్రలో ప్రియమణి

Priyamani Plays Sasikala In Jayalalitha Biopic Thalaivi

2003 సంవత్సరంలో “ఎవరే అతగాడు ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన ప్రియమణి తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషల చిత్రాలలో నటించారు. “పరుత్తివీరన్ ” తమిళ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు హిట్ చిత్రాలలో నటించిన ప్రియమణి తెలుగులో నటించిన ఆఖరి మూవీ “మన ఊరి రామాయణం” . తరువాత వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. “ది ఫ్యామిలీ మాన్ ” వెబ్ సిరీస్ తో ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కొన్ని ఆసక్తికర మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ మూవీ “తలైవి ” తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతుంది. జయలలిత జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న “తలైవి “మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత, అరవింద్ స్వామి ఎమ్ జి ఆర్, ప్రకాష్ రాజ్ కరుణానిథి గా నటిస్తున్నారు. జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పీఠం కొరకు ప్రయత్నించి జైలుకు వెళ్ళిన శశికళ పాత్రకు ప్రియమణి ఎంపిక అయ్యారు. “తలైవి “మూవీ తెలుగు, తమిళ భాషలలో “తలైవి “, హిందీ లో “జయ ” టైటిల్ తోనూ రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here