సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ వెంకీ మామ మూవీ డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ రాజ్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకీ మామ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రీ టీజర్, వినాయక చవితి ఫెస్టివల్ పోస్టర్, దసరా పండుగ కు ఫస్ట్ గ్లింప్స్ , దీపావళి పండుగకు వెంకటేష్ రఫ్ లుక్ , నాగ చైతన్య పారా మిలటరీ యూనిఫామ్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజ జీవిత మామ అల్లుళ్ళు వేంకటేష్, నాగచైతన్య వెంకీ మామ మూవీ లో మామ అల్లుళ్ళు గా నటించడం విశేషం. హీరో నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా కార్తీక్ క్యారెక్టర్ లో నటించిన నాగ చైతన్య గ్లింప్స్ ను ఈ రోజు వెంకీ మామ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: