రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల తర్వాత వస్తున్న మరో వివాదాస్పదమైన సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ తో ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చూపించబోతున్న కంటెంట్ ఎలా వుండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఒకదాని తర్వాత, ఒకటి ట్రైలర్లు రిలీజ్ చేస్తున్నాడు, పాటలు రిలీజ్ చేస్తున్నాడు కానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు వర్మ. నిజానికి అన్నీ ముందే చెప్పే వర్మ ఈ సినిమా రిలీజ్ విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు. అయితే భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని త్వరలోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.
కాగాతన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రంలో అనేక ఎలిమెంట్స్ ని డైరెక్టర్ టచ్ చేశాడు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యముండేలా తీర్చిదిద్దుతున్నాడు సిద్దార్థ్.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: