తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్య దేవత, అమ్మ, తలైవి , గ్రేట్ పొలిటీషియన్ జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. విబ్రి మోషన్ పిక్చర్స్ , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో రూపొందుతున్న “తలైవి “మూవీ అక్టో బర్ 10వ తేదీ చెన్నై లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న “తలైవి” మూవీ 2020 సంవత్సరం జూన్ 26 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లెజండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా “తలైవి ” మూవీ రూపొందుతుంది. జయలలిత సినీ జీవితం లోనూ, రాజకీయ జీవితంలోనూ పలువురి ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా సినీజీవితం లో లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, రాజకీయ జీవితం లో లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి ఎమ్ జి రామచంద్రన్, డి ఎం కే పార్టీ అధ్యక్షుడు కరుణానిథి, శశికళ, జానకీ రామచంద్రన్, పలువురి ప్రముఖుల ప్రమేయం ఉంది. ఎమ్ జి రామచంద్రన్ పాత్రకు అరవింద్ స్వామి, కరుణానిథి పాత్రకు ప్రకాష్ రాజ్ ఎంపికయ్యారు. మణిరత్నం ఇద్దరు మూవీ లో కరుణానిథి గా నటించిన ప్రకాష్ రాజ్ 22 సంవత్సరాల తరువాత ఆ పాత్రలో నటించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: