రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి పలు రీమేక్ మూవీస్‌లో నటించడమే కాకుండా… సింహభాగం ఘనవిజయాలు అందుకున్నారు వెంకీ. కాగా… తాజాగా ఈ సీనియర్ హీరో తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆ మధ్య ఓంకార్ పేరు వినిపించినా… అది వార్తలకే పరిమితం అయింది. తాజా సమాచారం ప్రకారం… ఆ అవకాశం యువ దర్శకుడు హను రాఘవపూడిని వరించిందని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ, ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాలతో రొమాంటిక్ అండ్ యాక్షన్ సబ్జెక్ట్స్‌ను బాగా డీల్ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు హను. `పడి పడి లేచె మనసు` తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టని ఈ టాలెంటెడ్ డైరెక్టర్ … ఇటీవల దర్శకుడి ఎంపిక కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన `అసురన్` స్పెషల్ షోకి అటెండ్ అయ్యాడని, అతను సూచించిన సలహాలు నచ్చడంతో సురేష్ బాబు అతని వైపే మొగ్గు చూపించారని టాక్. అంతేకాదు… ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. మరి… కెరీర్‌లో తొలిసారి వెంకటేష్ వంటి స్టార్ హీరోతో పాటు ఫస్ట్ టైమ్ రీమేక్ ని డైరెక్ట్ చేయబోతున్న హను… ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. త్వరలోనే హను ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: