హిందీలో కూడా వస్తున్న #prabhas20

Prabhas to Entertain Hindi Audience Again,Latest Telugu Movies News, Prabhas Gears Up To Shoot His Next Movie, Prabhas New movie shooting update, Prabhas Latest News 2019, Prabhas Next Movie Updates, Prabhas Upcoming Movie Details, Rebal Star Prabhas New Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన ‘సాహో’ ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా అందరిచేత ‘సాహో’ అనిపించుకుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తెలుగులో 200 పైగా కలెక్షన్స్ రాబట్టగా… హిందీలో 185 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. ఇప్పుడు సాహో హడావుడి కూడా అయిపోయింది. దీనితో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. విరామం తర్వాత నవంబర్ 18 నుండి మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాను కూడా హిందీలో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్ కు హిందీలో మరింత క్రేజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాను కూడా హిందీలో తీయాలని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. అంతే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఇప్పటినుండే ఎదురు చూస్తున్నారట.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =