లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, మూవీ మొఘల్ డి.రామానాయుడు కాంబినేషన్ అనగానే… పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కళ్ళ ముందు కదలాడతాయి. అటువంటి సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రమే ‘సిపాయి చిన్నయ్య’. కెప్టెన్ భాస్కర్, సిపాయి చిన్నయ్యగా ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కె.ఆర్.విజయ, భారతి కథానాయికలుగా నటించారు. సత్యనారాయణ, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, రావికొండలరావు, పండరీబాయి, ఋష్యేంద్రమణి ముఖ్య భూమికలు పోషించగా… “కళావాచస్పతి” జగ్గయ్య కీలకపాత్రలో దర్శనమిచ్చారు. జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ కథను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి, దాశరథి గీత రచన చేయగా… దిగ్గజ స్వరకర్త ఎం.ఎస్.విశ్వనాథన్ బాణీలు సమకూర్చారు. వాటిలో “నా జన్మభూమి ఎంత అందమైన దేశము” పాట బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే… “పడవ వచ్చిందే పిల్లా” గీతం కూడా అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. 1969 అక్టోబర్ 30న విడుదలైన ‘సిపాయి చిన్నయ్య’… నేటితో ఐదు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: