“రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో… బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. పరేష్ రవాల్, శ్రీకాంత్, శర్వానంద్, గిరీష్ కర్నాడ్, సూర్య, వేణుమాధవ్, అలీ, ఎం.ఎస్.నారాయణ, భూపేంద్ర సింగ్, చలపతిరావు, ‘ఆహుతి’ ప్రసాద్, వెన్నిరాడై నిర్మల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో తళుక్కున మెరవగా… అంజలా ఝవేరి ప్రత్యేక గీతంలో నర్తించింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయి ఎం.బి.బి.ఎస్.’కి రీమేక్‌గా ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’ను రూపొందించారు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. ‘బావగారూ బాగున్నారా!’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత చిరు, జయంత్ కలయికలో వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్, సాహితీ గీత రచన చేయగా… టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఆకట్టుకునే బాణీలు అందించారు. “శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.”, “నా పేరే కాంచనమాల”, “ఏ జిల్లా జిల్లా”, “చైల చైల”, “పట్టు పట్టు చెయ్యే పట్టు” వంటి పాటలు విశేషాదరణ పొందాయి. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై అక్కినేని రవిశంకర ప్రసాద్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఉత్తమ నటుడు(చిరంజీవి), ఉత్తమ సహాయ నటుడు(శ్రీకాంత్) విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను కైవసం చేసుకుంది. 2004 అక్టోబర్ 15న విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’… నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: