‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటలు కూడా లేనట్టు తెలుస్తుంది. అంతే కాదు 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు హక్కులు ప్రముఖ నిర్మాత చేతికి వెళ్లాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: