ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ముఖ్యంగా… శేఖర్ కెరీర్ ఆరంభంలో “మంచి కాఫీ లాంటి సినిమా” అంటూ వచ్చిన ‘ఆనంద్’ … తదనంతర కాలంలో క్లాసిక్ మూవీగా నిలచింది. ఆనంద్ గా రాజా, రూప గా కమలినీ ముఖర్జీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించగా… సత్యా కృష్ణన్, అనీష్ కురువిల్ల, అనుజ్ గుర్వారా, మెల్కోటే, బేబీ భకిత ఫ్రాన్సిస్ ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి గీతరచనకి సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ వీనుల విందైన బాణీలు అందించారు. “యమునాతీరం”, “వచ్చే వచ్చే”, “నువ్వేనా నా నువ్వేనా”, “తెలిసి తెలిసి”, “ఎదలో గానం”, ”చారుమతి ఐ లవ్ యు” వంటి పాటలు ప్రజాదరణ పొందాయి. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్… ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ నటి(కమలినీ ముఖర్జీ), ఉత్తమ సహాయ నటి(సత్యా కృష్ణన్), ఉత్తమ బాలనటి(భకిత), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్(సునీత), ఉత్తమ దర్శకుడు(శేఖర్ కమ్ముల) విభాగాలలో “నంది” పురస్కారాలను అందుకుంది. 2004 అక్టోబర్ 15న విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు విజయకేతనం ఎగురవేసిన ‘ఆనంద్’… నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: