కొన్ని జంటలు వెండితెరపై భలే మ్యాజిక్ చేస్తాయి. అలాంటి కాంబినేషన్స్‌లో ‘విక్టరీ’ వెంకటేష్, అభినేత్రి సౌందర్య జోడి ఒకటి. వీరిద్దరూ జంటగా నటించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘పెళ్లి చేసుకుందాం’కి ప్రత్యేక స్థానం ఉంది. “శీలం అనేది మనసుకు సంబంధించినది… శరీరానికి సంబంధించినది కాదు” అనే పాయింట్‌తో ‘పెళ్లి చేసుకుందాం’ తెరకెక్కింది. ‘పవిత్రబంధం’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత వెంకీ, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. లైలా మరో నాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌రాజ్, దేవన్, సత్యప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్, అన్నపూర్ణ, సుమిత్ర, రజిత, మాస్టర్ మహేంద్ర, బేబి సౌమ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
భూపతి రాజా కథకి పోసాని కృష్ణ మురళి అందించిన సంభాషణలు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. కోటి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ కూడా ప్రేక్షకులను రంజింపజేశాయి. “కోకిల కోకిల”, “ఓ లైలా లైలా”, “ఘుమ ఘుమలాడే”, “మనసున మనసై”, “ఎన్నో ఎన్నో”, “నువ్వేమి చేసావు” ఇలా ప్రతీ పాట విశేషాదరణ పొందింది. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి.వెంకట్‌రాజు, జి.శివరాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 1997 అక్టోబర్ 9న విడుదలై ఘనవిజయం సాధించిన ‘పెళ్లి చేసుకుందాం’… నేటితో 22 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.