మెగాస్టార్ చిరంజీవి అభినయపర్వంలో కలికితురాయిలా నిలిచిన చిత్రాలలో ‘ఆపద్బాంధవుడు’ ఒకటి. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ వంటి క్లాసిక్ హిట్స్ తరువాత కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన మూడో సినిమా ఇది. చిరంజీవిలోని నటుణ్ణి మరో స్థాయికి తీసుకువెళ్ళిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి నాయికగా నటించింది. కైకాల సత్యనారాయణ, శరత్‌బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, నిర్మలమ్మ, శిల్ప తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించగా… “హాస్యబ్రహ్మ” జంధ్యాల కీలక పాత్రలో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డా.సి.నారాయణరెడ్డి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత రచన చేయగా… స్వరవాణి కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ జనాదరణ పొందాయి. ముఖ్యంగా “ఔరా అమ్మకు చల్లా”, “పువ్వు నవ్వే గువ్వ నవ్వే”, “చుక్కల్లారా”(మేల్ అండ్ ఫీమేల్ వెర్షన్స్), “ఒడియప్పా” వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ’ఆపద్బాంధవుడు’ ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా… ఉత్తమ నటుడు(చిరంజీవి), ఉత్తమ మాటల రచయిత(జంధ్యాల) విభాగాలలోనూ పురస్కారాలను గెలుచుకుంది. 1992 అక్టోబర్ 9న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న’ఆపద్బాంధవుడు’కి… నేటితో 27 ఏళ్ళు పూర్తవుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: