మహానటుడు యన్.టి.రామారావు, దిగ్గజ నటీమణి అంజలీ దేవి జంటగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బాలనాగమ్మ’ ఒకటి. వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు, రేలంగి, లంక సత్యం, సీఎస్సార్, ఎ.వి.సుబ్బారావు, రాజసులోచన, హేమలత, సూర్యకళ, మాస్టర్ సత్యనారాయణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. 1942లో వచ్చిన ‘బాలనాగమ్మ’(సి.పుల్లయ్య దర్శకుడు) చిత్రానికి రీమేక్‌గా 17 ఏళ్ల అనంతరం ఈ ‘బాలనాగమ్మ’రూపొందింది. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ఈ రెండు చిత్రాలలోనూ రేలంగి, లంక సత్యం నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూనియర్ సముద్రాల కథ, మాటలు, పాటలు అందించగా… సంగీత దర్శకుడు టి.వి.రాజు అలరించే బాణీలు సమకూర్చారు. ముఖ్యంగా “విరిసింది వింత హాయి”, “నీకేలరా ఈ వేదనా” వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. శ్రీ వేంకటరమణా ఫిలిమ్స్ పతాకంపై బి.ఎస్.రాజు, డి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మించారు. 1959 అక్టోబర్ 9న దసరా కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ‘బాలనాగమ్మ’… నేటితో ఆరు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.