నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా పలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘క్రిష్ణబాబు’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా మీనా, రాశి నటించగా అబ్బాస్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రామిరెడ్డి, రంగనాథ్, నర్రా వెంకటేశ్వరరావు, సుత్తి వేలు, ఎం.ఎస్.నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి, రమాప్రభ,రజిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
సంగీత దర్శకుడు కోటి స్వరసారథ్యంలో రూపొందిన పాటల్లో “సఖి మస్తు మస్తు”, “ప్రేమ పాఠశాలలో”, “ముద్దుల పాప”, “హలో మిస్” ప్రజాదరణ పొందాయి. మీనా పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా… బాలకృష్ణ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం. 1999 సెప్టెంబర్ 16న విడుదలైన ‘క్రిష్ణబాబు’… నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.
ఈ మూవీ చూడాలంటే అమెజాన్ లో ఉంది. క్లిక్ చేయండి ఎంజాయ్ చేయండి.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.