#SaveNallamala పై టాలీవుడ్ స్పందన

Tollywood Celebs Support #SaveNallamala Campaign,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Save-Nallamala-campaign-Celebrities-Citizens-join-protest,Vijay Devarakonda joins Pawan Kalyan to save Nallamala,Actor Vijay Deverakonda joins chorus to Save Nallamala forest,Powerful Actors Pawan Kalyan And Vijay Start #SaveNallamala Campaign

నల్లమల ఫారెస్ట్ కర్నూల్, గుంటూరు, కడప , మెహబూబ్ నగర్, ప్రకాశం జిల్లాలలో విస్తరించింది. ఈ అటవీ ప్రాంతం పై ఆధారపడి పలు గిరిజన జాతులు జీవనం సాగిస్తున్నాయి. పశు పక్ష్యాదులు, జంతువులు ఆవాసం గా ఉంది. పులుల సంతతి కూడా ఎక్కువగా ఉంది. యురేనియం కై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లోని నాగర్ కర్నూల్ అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియాలో తవ్వకాలకు ప్రయత్నిస్తుండడం తో టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలు చేపట్టడం తో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని, కృష్ణా నది, ఉప నదులు కలుషితం అవుతాయని, యురేనియం తవ్వకం వల్ల కాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం నల్లమల అడవులు కాపాడే చర్యలు తీసుకోవాలని దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా ? కాలుష్య తెలంగాణ ఇస్తామా ?
అన్నది ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలని పవన్ కళ్యాణ్, ఇప్పటికే గాలి, నీరు కలుషితం అయ్యాయని, యురేనియం తవ్వకాలతో మరింత నష్టం కలుగుతుందని , యురేనియం కొనుక్కోవచ్చని, ఫారెస్ట్ ను కొనలేమని విజయ్ దేవరకొండ, ఎక్కడో ఉన్న అమెజాన్ అడవుల గురించి బాధ పడ్డాం, మనం ఏం చేస్తున్నాం ?ప్రకృతిని రక్షించుకొందాం అంటూ సాయి ధరమ్ తేజ్ తేజ్ ట్వీట్ చేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =