రాను రాను మీడియా సంయమనం కోల్పోతుంది . ఎక్స్ క్లూజివ్ న్యూస్, ఫస్ట్ న్యూస్ అనే పరుగు పందెంలో నేను ముందంటే నేను ముందు అనే హడావిడిలో పడి తప్పు వార్తలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడంతో మీడియా తన ప్రతిష్టను, విశ్వసనీయతను కోల్పోతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సమీపంలో జరిగిన చిన్న ప్రమాద వార్త లోని వాస్తవాలను తెలుసుకోకుండా ప్రమాద కారకుడిగా ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును పదే పదే ప్రచారం చేసి గందరగోళం సృష్టించింది మీడియా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు ఉదయం కొన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ లో ప్రముఖ సినీ హీరో తరుణ్ కారు యాక్సిడెంట్ చేశాడని, ప్రమాద స్థలంలోనే కారు వదిలి వెళ్లిపోయాడని చెప్పారు. అంతే… హీరో తరుణ్ కు అన్ని రకాల మీడియాల వారితో పాటు బంధు మిత్రులందరూ ఫోన్లు చేసి వివరాలు అడగటం మొదలుపెట్టారట. టీవీల్లో ఆ వార్తలుచూసి , ఫోన్లలో పరామర్శలు విన్న తరుణ్ తల్లి శ్రీమతి రోజారమణి కంగారు పడ్డారు. అప్పుడే జిమ్ కి వెళ్లి వచ్చి పడుకున్న తరుణ్ ను నిద్ర లేపి టీవీ చూపించడంతో అతను షాక్ అయ్యాడు. ఉదయం నుండి ఈ తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రసారం చేసిన టీవీ చానల్సు వారికి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసలు నిజం తెలిసింది.
ఆ ఎక్సిడెంట్ చేసింది తరుణ్ కాదు… రాజ్ తరుణ్ అని. అసలు విషయం తెలిసిన వెంటనే అయినా ఆ విజువల్స్, ఆ స్క్రోలింగ్ ను ఆపేసారా అంటే అదీ లేదు… తాపీగా ఎప్పుడో గంట తర్వాత అది తరుణ్ కాదు రాజ్ తరుణ్ అంటూ మరో రెండు గంటలు రాజ్ తరుణ్ విజువల్స్ తో కథ నడిపించారు.
ఇంతకు జరిగింది ఏమిటంటే- గత రాత్రి యువ కథానాయకుడు రాజ్ తరుణ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఔటర్ రింగ్ రోడ్డు మీద వస్తున్నాడు. తను డ్రైవింగ్ చేస్తున్న కారు ఆటో గేర్ కావటంతో ఆ సిస్టం అలవాటు లేని రాజ్ తరుణ్ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక డివైడర్ను గుద్దేసాడు. ఆ కంగారులో భయపడి అక్కడి నుండి పరుగున వెళ్లి పోయాడు. ఆ కారు నిర్మాత రామ్ తాళ్లూరిదట. చేయబోయే సినిమా అడ్వాన్స్ కు బదులు కారును రాజ్ తరుణ్ కు గిఫ్ట్ చేసారట రామ్ తాళ్లూరి. అందువల్ల ఆ కారు రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీదనే ఉంది.ఇది జరిగిన వాస్తవం.
కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ అనే తొందరలో ఎవరు? ఏమిటి? అనే వివరాలు తెలుసుకోకుండా రాజ్ తరుణ్ కు బదులు తరుణ్ అని మిస్ ప్రజెంట్ చేయడంవల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందిస్తూ హీరో తరుణ్ తల్లి గారైన శ్రీమతి రోజా రమణి ” ఏంటి బాబు మాకు పొద్దున్నే ఈ తలనొప్పి… ఒకళ్ళు ఎవరో రాంగ్ న్యూస్ ప్రసారం చేస్తే అందరూ దాన్ని పట్టుకొని ఇలా రిపీటెడ్ గా చూపిస్తుంటే ఎంత న్యూసెన్స్ గా ఉంటుందో చెప్పండి. అది మా అబ్బాయి కాదు అని చెప్పిన తర్వాత కూడా గంట దాకా అవే స్క్రోలింగ్ వేస్తున్నారు. మీరైనా చెప్పండి బాబు… అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఉంటున్నాయి ఈమధ్య మన మీడియా నిర్వాకాలు. తాజా వార్తల ప్రసార పోటీలో వాస్తవాలను నిర్లక్ష్యం చేయటం మీడియా క్రెడిబిలిటీకి గొడ్డలి పెట్టు. ఇదంటే చిన్న విషయం కాబట్టి పర్వాలేదు…కానీ ప్రతి విషయంలోనూ మీడియా పొంతన లేని భిన్న కథనాలు ప్రసారం చేయటం దురదృష్టకరం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: