నటసింహ నందమూరి బాలకృష్ణ పక్కన కనువిందు చేసిన కథానాయికల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ చిత్రాల్లో బాలయ్య, సోనాల్ జోడీ నందమూరి అభిమానులను మురిపించింది. స్వల్ప విరామం తరువాత ఈ ఇద్దరూ… ముచ్చటగా మూడోసారి జట్టుకట్టారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది.
ఇదిలా ఉంటే… రొమాన్స్, యాక్షన్, కామెడీ… ఇలా నవరసభరితంగా సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సోనాల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే… `లెజెండ్`, `డిక్టేటర్` తరహాలోనే మోడరన్ గాళ్‌గా కనిపించబోతోందట సోనాల్. కాగా… తన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందట.
వేదిక మరో నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కానుందని టాక్.
[subscribe]
[youtube_video videoid=noeAchRDWGA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.