నాగార్జున ద‌ర్శ‌కుడితో నాని చిత్రం?

2019 Latest Telugu Film News, Nani to Act in Rahul Ravindran Direction,Under Ravindran Direction Actor Nani, Nani Ropped An Interesting Role, Nani Next With Ravindran Direction, Nani Latest Movie News, Rahul Ravindran Next Movie Project With Acto Nani, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
‘చి.ల.సౌ’ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు రాహుల్ రవీంద్రన్. క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మై ఆన‌క దర్శకుడిగా ట‌ర్న్ అయిన‌ రాహుల్… ‘చి.ల.సౌ’కిగానూ `బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే` కేట‌గిరిలో తాజాగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు రాహుల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ థియేటర్ల‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన మూడో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లో చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్‌. అంతేకాదు… ఆ సినిమాలో క‌థానాయ‌కుడిగా నేచురల్ స్టార్ నాని నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే నాని, రాహుల్ కాంబినేష‌న్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాగా… నాని అప్‌క‌మింగ్ ఫిల్మ్‌ ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న విడుదల కానుండగా… ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రీకరణ దశలో ఉంది. [subscribe] [youtube_video videoid=bCITH3-eaRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =