సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… అలనాటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో మరో షెడ్యూల్‌ను కూడా ఫినిష్ చేసుకుందని టాక్. ఈ షెడ్యూల్‌లో భాగంగా సినిమాలో చాలా ఫన్నీగా సాగే ట్రైన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించారని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఈ లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్ దాదాపు అరగంటకు పైగా సాగుతుందని… హిలేరియస్‌గా సాగే ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇన్ సైడర్స్ టాక్ ప్రకారం… ఈ ట్రైన్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిసింది.
కాగా… నవంబర్ కల్లా షూటింగ్‌ను కంప్లీట్ చేసి… 2020 సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్త నిర్మాణంలో `సరిలేరు నీకెవ్వరు` నిర్మితమవుతుండగా… దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=EDBBE7uY0pQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: