`బెంగాల్ టైగర్`, `టచ్ చేసి చూడు` చిత్రాల్లో జంటగా నటించి అలరించారు మాస్ మహారాజా రవితేజ, అందాల తార రాశీఖన్నా. తాజా సమాచారం ప్రకారం… ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి జోడీకట్టనున్నారని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రవితేజ `మహాసముద్రం` పేరుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. కాగా… ఈ చిత్రంలో రవితేజకి జోడీగా అదితి రావ్ హైదరీ నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే కాల్షీట్ల సమస్య కారణంగా అదితి తప్పుకుందని… ఇప్పుడా పాత్రలోనే రాశి నటించనుందని టాక్. సిద్ధార్థ్ కీలక పాత్రలో కనిపించనున్న `మహా సముద్రం` 2020 ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే… రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా` ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్‌లో ఈ రిలీజ్ కానుందని సమాచారం.
[subscribe]
[youtube_video videoid=GoNpNb8lsPo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: