వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో ‘ఎవరు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. దీంతో ఇంకా రెండు వారాలు మాత్రమే రిలీజ్ కు ఉండటంతో.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను, టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో స్పెషల్ ఆఫర్ ను ఇచ్చారు ఎవరు టీమ్. ఈ సినిమా నిజానికి ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ అవుతుంది. ఐతే ఒకరోజు ముందే అంటే ఆగష్ట్ 14న చూసే అవకాశం ఇచ్చారు. అయితే ఫ్రీగా కాదులెండి. ప్రీ పైడ్ ప్రీమియర్ తో ఒక రోజు ముందే చూసే అవకాశం అన్నమాట. ఇది కేవలం హైదరాబాద్ మరియు కొన్ని థియేటర్ లలో మాత్రమే.
ఇంకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
[youtube_video videoid=oHNldqwhb4g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: