విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు. ఆ తరువాత వరుస హిట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక విజయ్ కు కేవలం యూత్ లోనే కాదు యంగ్ హీరోయిన్ల లో కూడా విజయ్ పై క్రేజ్ రోజు రోజు కు పెరిగిపోతుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది అని చెప్పిందంటే విజయ్ క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆమే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని కూడా గతంలో తనకు విజయ్ తో చేయాలని చెప్పింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తనకు విజయ్ పై వున్నా ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు ఒక్క కన్ను గీటుతో నైట్ కు నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్. ఇలా కన్ను గీటి అలా కుర్రకారును తనవైపు తిప్పుకుంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. తాజాగా ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని తెలుగులో క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొత్తానికి మన తెలుగు హీరో కు ఇక్కడ వాళ్ళే కాదు బాలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఫిదా అవుతున్నారు. మరి విజయ్ వాళ్ళతో ఫ్యూచర్ లో ఏమన్నా సినిమా తీసే ఛాన్స్ వుందో? లేదో? ఇంకా ఎంత మంది రౌడీ కి ఫిదా అవుతారో చూద్దాం..!
[youtube_video videoid=MLGUyzQqS3Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: