అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరూ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. రెండో షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఓ సర్ ప్రైస్ ఇచ్చారు చిత్ర యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో తన పాత్రను పరిచయం చేస్తూ ఇంట్రడక్షన్ ప్రోమో విడుదల చేశారు. “సరిలేరు నీకెవ్వరూ.. నువ్వెళ్ళే దారికి జోహారూ…”అని బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట చాలా పవర్ ఫుల్ గా వుంది.
కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[youtube_video videoid=YaCGtGfoI1Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: