“ శ్రీనివాస రావు గారు! నమస్తే”…
“ నమస్తే – చెప్పండి”
“మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ట్రెజరర్ పదవికి రాజీనామా చేశారు కదా”!
” అవును.. చేసాను”.
” మరి మీరు మీ రాజీనామాను ఉపసంహరించుకున్నారు అనే వార్త ఒకటి వినిపిస్తోంది.. నిజమేనా? అసలు మీ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరిస్తారా?”
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
” ఒక నిర్ణయం అంటూ తీసుకుని రాజీనామా చేసిన తరువాత వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు… అయినా నేను రాజీనామా ఉపసంహరించుకున్నానని
మీకు ఎవరు చెప్పారు? అవతల 1400 మంది సభ్యుల సంక్షేమం కోసం
యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కొన్ని నికరమైన హామీలు ఇచ్చిన తరువాత వాటిని గౌరవించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో నేను రాజీనామా చేశాను. ఎట్టి పరిస్థితుల్లో నా రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. నేను రాజీనామా ఉపసంహరించుకున్నా నని ఎవరు చెప్పినా నమ్మద్దు. ఇక్కడ పదవులు ముఖ్యం కాదు. ఇండస్ట్రీ సంక్షేమం ముఖ్యం. ఎప్పుడైనా సినిమాలు తీస్తున్న రన్నింగ్ ప్రొడ్యూసర్స్ కే నిర్మాణంలోని సాధకబాదాకాలు తెలుస్తాయి. కాబట్టి వారికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సారథ్యం అప్పగించటం న్యాయం. వారు సభ్యులందరి సంక్షేమానికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటాము అని హామీ ఇస్తున్నప్పుడు ఇంకేం కావాలి? అందుకే నేను రిజైన్ చేయటమే కాకుండా మిగతా వాళ్ళని కూడా చేయమన్నాను. వాళ్ళు చేయకపోగా నేను రాజీనామాను ఉపసంహరించుకున్నానని ప్రచారం చేయటం తప్పు కదా ? కాబట్టి మీ ద్వారా మరొక మారు స్పష్టంగా చెబుతున్నాను… నేను రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు.”
ఇలా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడిన వ్యక్తి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఇటీవల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాల తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతుంది పైన జరిగిన సంభాషణ. అసలు ఎన్నికలకు ముందే పోటి నుండి విరమించుకుంటామని విత్ డ్రా లెటర్స్ పట్టుకు తిరిగిన వాళ్ళు , గెలిచినా కూడా రాజీనామాలు చేస్తామని చెప్పిన వాళ్లు ఇలా ప్లేట్ ఫిరాయించి పదవులు పట్టుకు వేలాడ్డం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి విమర్శలకు తను అతీతుడనని నిరూపిస్తూ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కౌన్సిల్ లో ట్రెజరర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన స్వచ్ఛంద రాజీనామా మీద కూడా రాజకీయాలు చేస్తూ ఆయన రాజీనామా ఉపసంహరించుకున్నారనే పుకార్లు పుట్టించిన నేపథ్యంలో “తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” నేరుగా ఆయనతోనే మాట్లాడింది.
చదివారుగా ఆయన ఏమన్నారో…
ఇదీ వాస్తవం.
నిర్మాతల మండలి సర్వసభ్య సంక్షేమం కంటే తమ పదవులే ముఖ్యం అనుకుంటున్నవారి కారణంగా చిత్ర పరిశ్రమలో ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
[youtube_video videoid=DZGOJh7DDyg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: