చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు బండ్ల గణేష్. గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బండ్ల గణేష్ నటిస్తున్నాడు. ఈ రోజు షూటింగ్ లో బండ్ల గణేష్ పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.
కాగా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.
[youtube_video videoid=uiqL3xbQuTs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: