ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో ‘జోడి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ‘బుర్రకథ’ తరువాత ఆది సాయికుమార్ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
ఇక గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇంకా ఈసినిమాలో నరేష్, సత్య, వెన్నెల కిషోర్, సిద్దు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతీరావు వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ తదితరలు ఇతర పాత్రల్లో నటించారు. భావనా క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గుర్రం సమర్పణలో రూపొందుతున్న ఈసినిమాకి ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=elyZEYmVlqY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: