మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ క్రేజీ ప్రాజెక్ట్. కాగా… మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించేందుకు ‘గల్ఫ్’, ‘అభినేత్రి 2’ ఫేమ్ డింపుల్ హయతిని ఎంపిక చేసిందట చిత్ర బృందం. ఈ పాటలో డింపుల్ చేసిన డ్యాన్సింగ్ మూమెంట్స్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి… ఈ హైదరాబాదీ అమ్మాయి ఈ స్పెషల్ సాంగ్‌లో ఏ మాత్రం మురిపిస్తుందో చూద్దాం. మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=hGQTUrvmRHs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: