మెగాస్టార్‌కి మ‌రోసారి సెంటిమెంట్ క‌లిసొస్తుందా?

2019 Latest Telugu Movie News, Megastar Chiranjeevi to Follow Rakshasudu Sentiment, Rakshasudu Sentiment for Megastar Chiranjeevi, October 2nd Sentiment for Megastar Chiranjeevi, Chiranjeevi Sye Raa Movie Latest News, Chiranjeevi Sye Raa Movie Release Date, Chiranjeevi Sye Raa Movie Release On October 2nd, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Megastar Chiranjeevi to Follow Rakshasudu Sentiment

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ హిస్టారిక‌ల్ డ్రామాకు… సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన‌ ఈ చిత్రం… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా… ‘సైరా’ను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆసక్తికరమైన అంశమేమిటంటే… గతంలో ఇదే తేదీన అంటే… అక్టోబర్ 2, 1986న చిరు హీరోగా నటించిన ‘రాక్షసుడు’ విడుదలైంది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఆ సినిమా చిరుకి మరపురాని విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో… ఇప్పుడు అదే అక్టోబర్ 2న విడుదల కానున్న ‘సైరా’ కూడా చిరంజీవికి మరో మెమొరబుల్ ఫిలిమ్‌ అవుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=uiqL3xbQuTs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.