‘కింగ్’ నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో ‘మన్మథుడు 2’ రూపొందిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో… సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా… సీనియర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా… ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… దర్శకుడిగా రాహుల్ వర్కింగ్ స్టైల్ నచ్చి నాగ్ మరో అవకాశం ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… తన తనయులైన నాగచైతన్య, అఖిల్ ఇద్దరితో ఓ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేయమని దర్శకుడు రాహుల్‌ని కోరారట కింగ్. దానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి… రానున్న రోజుల్లో ఈ అన్నదమ్ముల మల్టీస్టారర్ మూవీకి సంబంధించి మరింత స్పష్టత వస్తుందేమో చూద్దాం.
[youtube_video videoid=3SBg3osceEs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: