`ఎఫ్ 2`తో భారీ విజయం అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్… ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి `వెంకీమామ`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా… విజయదశమి కానుకగా విడుదల కానుందని సమాచారం. కాగా, ఈ చిత్రం తరువాత వెంకీ… హిందీ బ్లాక్‌బస్టర్ `దే దే ప్యార్ దే` రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ఆగస్టు చివరలో లేదా సెప్టెంబర్ ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు, చకచకా నిర్మాణం జరుపుకుని వచ్చే సంవత్సరం వేసవికి ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. అంటే… సంక్రాంతి సీజన్‌లో `ఎఫ్ 2`తో పలకరించిన వెంకీ… తదుపరి చిత్రాల విషయంలోనూ సీజన్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేసే అవకాశముందన్నమాట.
[youtube_video videoid=8sqmKsDWDhg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: